IND VS PAK: రోహిత్ సేన ఒళ్లు దగ్గర పెట్టుకోని ఆడాలి *Cricket | OneIndia Telugu

2022-08-13 8

IND vs PAK: Indian Team Should be carefull with these 3 Pakistan Players this time ahead of Asia Cup 2022 |
ఆగస్టు 27 నుంచి ప్రారంభమయ్యే ఆసియాకప్‌లో భారత్, పాక్ తొలి మ్యాచ్‌లోనే తలపడనున్నాయి. అయితే దాయాదుల పోరులో విజయం తమదేనని ధీమాగా ఉండే భారత అభిమానులు ఈ సారి కాస్త కలవరపడుతున్నారు. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ చేతిలో ఎదురైన ఓటమిని మరిచిపోలేకపోతున్నారు. షాహిన్ షా అఫ్రిది బౌలింగ్ దెబ్బతో పాటు బాబర్ ఆజామ్, మహమ్మద్ రిజ్వాన్ సూపర్ బ్యాటింగ్‌తో భారత్ ఆ మ్యాచ్‌లో 10 వికెట్లతో చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్ నేపథ్యంలోనే ఈ ముగ్గురు ఆటగాళ్లతో రోహిత్ సేన జాగ్రత్తగా ఉండాలని అభిమానులతో పాటు క్రికెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు.


#INDVSPAK
#AsiaCup2022
#BabarAzam
#rohitsharma
#MohammadRizwan
#ShaheenAfridi
#t20worldcup